వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లిన రోగుల వద్ద ఓపి చీట్లు పొందాలంటే గంటల తరబడి నిలబడగలిగే ఓపిక ఉండాల్సిందే…సామర్లకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సర్వర్ల పని చేయక ఓపి టికెట్లు నమోదు కాని పరిస్థితి ఏర్పడింది. ఓపి పూర్తి కాకపోతే రోగులు వైద్యశాల పొందలేని పరిస్థితుల్లో గంటల తరబడి ప్రజలు ఓపి కోసం పడిగాపులు పడ్డారు. ప్రతీసోమవారం అనగానే ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య వందల సంఖ్యలో ఉండడం సహజం. అయితే ఓపి కౌంటర్ వద్ద సర్వర్లో పనిచేయని కారణంగా రోగులు సేవలు కోసం నిలబడలేక ఇబ్బంది పడ్డారు. దానికి తోడు ఆసుపత్రికి వచ్చే రోగులు ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకురావాలని సిబ్బంది చెబుతుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటివరకు రోగుల వద్ద ఫోన్ ఉండి ఆధార్ కార్డు నెంబర్ చెబితే ఆన్లైన్ ఓపి రిజిస్ట్రేషన్ పూర్తయ్యేది.ప్రస్తుతం ఒరిజినల్ ఆధార్ కార్డు కావాలని కోరుతుండడంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 9 గంటలకు వెళ్ళినా ప్రజల సైతం మధ్యాహ్నం 12:30 వరకు ఓపి కౌంటర్ వద్ద బారులు తీరి నిలబడినా ఓపి టికెట్లు చేతికి రాకపోవడంతో ప్రజల ఆందోళన వ్యక్తం చేశారు. ఓపి కోసం గంటల తరబడి నిలబడే ఓపిక తమకు లేదంటూ ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ కు సంబంధించి సర్వర్లు పనిచేయని సమయంలో పాత పద్ధతి ద్వారా ఓపి కాపీ లు అందించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వైద్యసేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.









