Search
Close this search box.

  గాడిద పాలు పేరుతో రూ. 100 కోట్ల మోసం

November 16, 2024 8:11 AM | Aditya369 News

గాడిద పాలు పేరుతో రూ. 100 కోట్ల మోసం

గాడిద పాల ఉత్పత్తి పేరిట తమిళనాడుకు చెందిన డ్యాంకీ ప్యాలెస్ సంస్థ రూ. 100 కోట్ల మోసానికి పాల్పడింది. లీటర్ గాడిద పాలు రూ. 1600 లకు కొనుగోలు చేస్తామంటూ దక్షిణ భారతంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రైతులను నమ్మించింది. అందుకు వారితో ఒప్పందం సైతం కుదుర్చుకుంది. ఆ క్రమంలో ఒక్కొ గాడిదను వారికి రూ. లక్షన్నరకు విక్రయించింది. ఒప్పందం ప్రకారం తొలి మూడు నెలలు రైతులకు సక్రమంగా సంస్థ నగదు చెల్లించింది. ఆ తర్వాత వారికి నగదు చెల్లింపులు నిలిపివేసింది. దీంతో సంస్థ యాజమాన్యాన్ని రైతులు నిలదీశారు.

దాంతో వారికి చెక్కులను అందజేసింది. అవి సైతం బౌన్స్ అయ్యాయి. తాము మోసపోయామని రైతులు భావించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన బాధితులు సోమాజిగూడలోని ప్రెస్‌ క్లబ్‌లో తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమను న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరారు. గత 18 నెలలుగా తమకు నగదు చెల్లించడం లేదని వారు తెలిపారు. ఇటీవల కాలంలో గాడిద పాలు విక్రయం బాగా పెరిగింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు