Search
Close this search box.

  స‌ముద్రం-న‌ది ముఖ‌ద్వారం వ‌ద్ద‌ చిక్కుకున్న బోటు..త‌ప్పిన పెను ప్ర‌మాదం

February 18, 2026 10:45 PM | Aditya369 News

స‌ముద్రం-న‌ది ముఖ‌ద్వారం వ‌ద్ద‌ చిక్కుకున్న బోటు..త‌ప్పిన పెను ప్ర‌మాదం

కాకినాడ వ‌ద్ద ఉన్న కోరంగి మ‌డఅడ‌వుల‌కు బ‌య‌లుదేరిన బోటు స‌ముద్రంముఖ ద్వారం వ‌ద్ద చిక్కుకుపోవ‌డంతో టూరిస్టులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. కోన‌సీమ జిల్లా ముమ్మిడివ‌రం ప్రాంతానికి చెందిన కొంద‌రు మ‌డ అడవుల‌ను చూసేందుకు కోరంగి నుండి బోటులో బ‌య‌లుదేరారు. అయితే బోటు మ‌డఅడ‌వుల‌కు వెళ్లే మార్గంలో స‌ముద్ర‌మ‌ఖ‌ద్వారం ఒక్క‌సారిగా ఆగిపోయింది. బోటు కింద నీటిలో పాడై ఉన్న వ‌ల‌లు బోటు ఇంజ‌న్ కు చిక్కుకోవ‌డంతో ముందుకు క‌ద‌ల్లేదు. దీంతో ఒక్క‌సారిగా బోటు ఉన్న సుమారు 15 మంది తీవ్ర ఆందోళ‌న‌కు గురయ్యారు. అయితే వెంట‌నే బోటు డ్రైవ‌ర్ అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో వారు స్పీడు బోటు పంపించి వారిని సుర‌క్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్ర‌యాణికుల్లో కొంత మంది ముమ్మిడివరానికి చెందిన న్యాయ‌వాదులు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు