పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్పిరిట్’ పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న ఈ పవర్‌ఫుల్ కాప్ డ్రామా షూటింగ్ ఇప్పటికే సుమారు 40 శాతం పూర్తైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా, బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న తాజా కథనాల ప్రకారం ఈ చిత్రంలో ఓ కీలక అతిథి పాత్ర కోసం స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఈ ఆఫర్‌పై ఆమె సానుకూలంగా స్పందించినట్లు టాక్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌లో ఆమె భాగమైతే, దాదాపు 11 ఏళ్ల తర్వాత ‘స్పిరిట్’ సినిమాతో కత్రినా కైఫ్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వనుంది.
ఇక సినిమాలో కత్రినా కైఫ్ పోలీస్ అధికారిణి పాత్రలో కనిపించే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే త్రుప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లలో ప్రభాస్ వైల్డ్ అండ్ మాస్ లుక్‌లో అలరించనున్నాడని ప్రచారం జరుగుతోంది.
టి-సిరీస్‌తో పాటు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో కొత్త కథాంశాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. అధికారిక ప్రకటనలు ఇంకా వెలువడాల్సి ఉన్నప్పటికీ, ‘స్పిరిట్’ ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.








