పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలోసోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరహార దీక్ష చేపట్టారు.ఈ దీక్షను సిఐటీయూ జిల్లా నాయకులు రాజ్ కుమార్,మలక వెంకటరమణ,జెవివి నాయకులు రెడ్డి, నాయకులకు పూల దండలు వేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సి.హెచ్ లోవరాజు, ఎం.గంగా సూరిబాబు లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని ఆరోపించారు.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 7 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ లో ఉందని,డబ్బులు కట్టకపోతే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులను మిడ్, సెమిస్టర్ పరీక్షలకు హాజరవ్వనివ్వడం లేదని, ఫీజు కట్టిన వారికే హల్ టికెట్స్ మంజూరు చేస్తామని విద్యార్థులను యాజమాన్యాలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.నిరహార దీక్షను కౌలు రైతులు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.రాజశేఖర్, యు.టీ.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నగేష్ దీక్షలో పాల్గొన్న సభ్యులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేయించారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ నాయకులు సంజయ్,సత్యం,జై రామ్,రాజు,ఆదర్శ,గమినివేలు,విద్యార్థిని,విద్యార్థులు,
తదితరులు పాల్గొన్నారు.









