ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ సినిమా పై రోజుకో రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. రీసెంట్ గా మరో రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..బాలీవుడ్లో తన యాక్టింగ్ తోక గుర్తింపు పొందిన విద్యా బాలన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఏ పాత్రలో నటించినా, తాను పాత్రకే జన్మించినట్టుగా నటనతో ఆకట్టుకుంటుంది. తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా, ఆమె ఎన్టీఆర్ బయోపిక్ (కథానాయకుడు – మహానాయకుడు) లో బసవతారకం పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు…ఇప్పుడే వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, విద్యా బాలన్ మళ్లీ టాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. అదే కాదు, ఈసారి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం..గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది.. ఈ సినిమాలో విద్యా బాలన్‌కు ఓ పవర్ఫుల్ రోల్‌ను దర్శకుడు సిద్ధం చేశారని ఇండస్ట్రీలో టాక్.. ఈ సినిమాలో ఎన్టీఆర్ తల్లిగా విద్యా బాలన్ నటించబోతున్నట్లు సమాచారం.. ప్రశాంత్ నీల్ సినిమాలో మదర్ సెంటిమెంట్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది.. కేజీఫ్, సలార్ సినిమాలు ఉదాహారణగా చెప్పచ్చు.. అయితే ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ తల్లిగా విద్యా బాలన్ నటించబోతున్నట్లు సమాచారం.. ఈ పాత్రకు మంచి స్కోప్ ఉండటంతో, ప్రశాంత్ నీల్ ఆమెను సంప్రదించినట్టు సమాచారం..ఇదే తరహాలో విద్యా బాలన్ పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతోందట.. ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, సంగీతం అందిస్తున్నాడు అజనీష్ లోక్ నాథ్. ‘డ్రాగన్’ను 2026 జూన్ 25 న విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు..









