ప్రస్తుతం మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ssmb 29 సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.. ఈ సినిమా దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజిలో తెరకకేబోతుంది.. ఈ సినిమా లో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది.. పృథ్వీరాజ్ సుకుమార్ వంటి స్టార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ సినిమా కోసం యావత్ ఇండియన్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా 2027 లో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.. ఐతే మహేష్ బాబు ఈ సినిమా తర్వాత నెక్స్ట్ చేయబోయే సినిమా డైరెక్టర్ పై సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. ఇప్పటికే మహేష్ బాబు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.. ఐతే మరో యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.. బుచ్చిబాబు డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.. బుచ్చిబాబు ఇప్పటికే రామ్ చరణ్ తో పెద్ది సినిమా చేస్తున్నాడు..ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తున్నారు.. ఆ తరువాత బుచ్చిబాబు మహేష్ తో సినిమా చేయబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది..









