Search
Close this search box.

  “ఈ నగరానికి ఏమైంది” సీక్వెల్ పై హింట్ ఇచ్చిన డైరెక్టర్..!

టాలీవుడ్ యూత్ కు కనెక్ట్ అయిన క్లాసిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాల్లో “ఈ నగరానికి ఏమైంది” ఒకటి. విశ్వక్ సేన్ హీరోగా,అభినవ్ గోమటం,లాంటి కమెడియన్స్ కీలక పాత్రల్లో నటించారు.. ఈ సినిమాను టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించారు.. సింపుల్ స్టోరీతో, యూత్‌ని బాగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. సినిమా విడుదలైనప్పుడు అంచనాలు లేనిప్పటికీ, నెట్టింట వైరల్ అయిన మీమ్స్ వలన ఈ సినిమా మళ్ళీ పెద్ద పాపులరిటీ వచ్చింది..

 

ఇటీవల,టాలీవుడ్లో సీక్వెల్ ట్రెండ్ బాగా కొనసాగుతుంది.. దాంతో చిన్న పెద్ద సినిమాలు తేడా లేకుండా సీక్వెల్ తెరకెక్కుతున్నాయి.. ఐతే బాగా హిట్ అయినా సినిమాల సీక్వెల్ పై ఆడియెన్స్ ఆసక్తి చూపడంతో డైరెక్టర్స్ కూడా సీక్వెల్ సినిమాలు తీయడానికి రెడీ అవుతున్నారు.. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది సినిమాకు కూడా సీక్వెల్ ఉండబోతున్నట్లు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సోషల్ మీడియా వేదికగా హింట్ ఇచ్చారు..‘ఈ’ అంటూ తరుణ్ భాస్కర్ తన సోషల్ మీడియా స్టోరీలో పోస్ట్ చేసిన ఒక సినిమాతో ఈ సినిమా షూటింగ్ గురించి హింట్ ఇచ్చాడు. “ఈ సంవత్సరం కొన్ని బాకీలు తీర్చాలె” అని విశ్వక్ సేన్, ‘ఈ నగరానికి ఏమైంది’ లో ధరించిన సింబల్ నల్ల కళ్లద్దాలు పెట్టి ఆ పోస్ట్ చేశాడు… దాంతో ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఐతే గతంలో ఓ వేదికలో తరుణ్ భాస్కర్ “ఈ నగరానికి ఏమైంది” సీక్వెల్ తీయబోతున్నట్లు చెప్పాడు కానీ.. ఇన్ని రోజుల తరువాత ఆ పనులు మొదలు పెట్టినట్లు సమాచారం.. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు అన్నీ పూర్తి అయ్యినట్లు సమాచారం.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం..

ఈ సీక్వెల్‌కు ప్రేక్షకుల్లో మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు, అంతేకాకుండా, సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి.. చూడాలి మరి ఈ సీక్వెల్ ఆడియెన్స్ కు ఏ రేంజిలో కనెక్ట్ అవుతుందో..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు