మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీ గా ఉన్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది.బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ గా ఈ సినిమా రూపొందుతుంది. దాదాపు 100కోట్ల బడ్జెట్ తో యువి క్రియేషన్స్ నిర్మిస్తుంది.. ప్రస్తుతం విఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది.. ఐతే మెగాస్టార్ క్రేజీ యంగ్ డైరెక్టర్ లతో
సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు..
ఐతే మెగాస్టార్ విశ్వంభర సినిమా తరువాత మరో రెండు సినిమాలు కమిట్ అయ్యారు. అందులో ఒకటి అనిల్ రావిపూడితో కాగా మరో సినిమా దసరా సినిమా తో ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే ఈ సినిమాను హీరో నాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. వాల్ పోస్టర్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు నాని. ఈ సినిమాలో హీరోయిన్, సాంగ్స్ ఏమి ఉండవు అని డైరెక్టర్ ఓదెల ఓ ఇంటర్వ్యూ చెప్పాడు.. దాంతో ఈ సినిమా మరింత హైప్ పెరిగింది.. ఐతే ఎప్పుడు ఈ సినిమా టైటిల్ “గ్యాంగ్ స్టార్” అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. అలాగే ఈ సినిమా లో మెగాస్టార్ గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తాడని సినీ వర్గాల్లో సమాచారం.. ఈ సినిమా మొత్తం ఫుల్ యాక్షన్ తో పాటు రూరల్ రస్టిక్ డ్రామా గా రాబోతున్నాట్లు సమాచారం. అంతే ఇందులో మెగాస్టార్ డ్యుయలో రోల్ చేస్తున్నారట, ఒక గెటప్ డిగ్లామర్ లో ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాలో మెగాస్టార్ వింటెజ్ లో లుక్ లో ఉండబోతున్నారని తెలిసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఈ సినిమా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ నానితో “ద ప్యారడైజ్” అనే సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా పూర్తి అయినా తరువాత మెగాస్టార్ ప్రాజెక్టు పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. మరి చూడాలి మెగాస్టార్ శ్రీకాంత్ ఏ రేంజ్ లో చూపిస్తాడో..









