పెద్దాపురం డివిజన్ పరిధిలో గ్రాడ్యుయేట్ ఎం ఎల్ సి ఎన్నికలకు సంబం ధించి ఎన్నికల సామాగ్రి పంపిణీకి ఆర్ డి ఓ కార్యాలయంలో అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసినట్లు ఆర్డిఓ శ్రీరమణి,జేసీ హెచ్ ఎస్ భవనలు తెలిపారు. ఈనెల 26వ తేదీ ఉదయం 8 గంటల నుండి డివిజన్ పరిధిలోని 31 పోలింగ్ కేంద్రాలకు ఈ సామగ్రి పంపిణీ జరుగుతుందన్నారు.రూట్ -1 జగ్గంపేట,గండేపల్లి,రూట్- 2 ఏలేశ్వరం,రూట్ -3 కిర్లంపూడి, ప్రత్తిపాడు, రూట్ -4 శంఖవరం,రౌతులపూడి,రూట్ -5 తుని,రూట్- 6 కోటనందూరు, తొండంగి,రూట్- 7 పెద్దాపురం మండలాల 7 రూట్లు గా ఏర్పాటు చేశామన్నారు.









