దుబాయ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ లో యువనేత ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ బాబు సందడి చేశారు. నేరుగా మ్యాచ్‌ను తిలకించేందుకు ఆయన దుబాయ్ వెళ్లారు.లోకేష్ కొడుకు దేవాన్ష్ తో కలిసి మ్యాచ్‌ను తిలకించారు. ఐసీసీ ఛైర్మన్ జైషాను లోకేష్ కలిశారు.ఏపీ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షులు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఏపీ క్రికెట్ అసోషియేషన్ ఉపాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు(కాకినాడ), దర్శకుడు సుకుమార్ లు లోకేష్‌తో ఫొటోలు దిగారు. దుబాయ్ వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి కూడా భారత్-పాక్ మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు.









