కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పై అవిశ్వాసం, ఎన్నిక నేపథ్యంలో టెన్షన్ వాతావరణ నెలకొంది. కోరం లేక మూడుసార్లు ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. వైసిపి 17 మంది కౌన్సిలర్లను దాచి వేసిందని టిడిపి ఆరోపిస్తోంది. అధికార బలంతో వైసిపి కౌన్సిలర్లను భయపెడుతున్నారని వైసీపీ ఆరోపణ నేపథ్యంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఇదిలా ఉండగా చలో తునికి పిలుపునిచ్చిన దాడిశెట్టి రాజా పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తుని బయలుదేరిన ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు వెనక్కి తిప్పి పంపారు.









