గతనెల జనవరి 13 న ఆరంమైన 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే మహా కుంభమేళా ప్రయాగ్రాజ్లో జరుగుతోంది.దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.యూపీ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకూ దాదాపు 44 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు.ఫిబ్రవరి 26న ముగియనున్న మహా కుంభమేళాకు జన ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది.









