Search
Close this search box.

  ప్రభాస్ ‘ఫౌజీ’ స్టోరీ లీక్..? ఒళ్లు గగుర్పొడిచే ప్లాట్ వైరల్..!

April 22, 2026 10:31 PM | Aditya369 News

ప్రభాస్ ‘ఫౌజీ’ స్టోరీ లీక్..? ఒళ్లు గగుర్పొడిచే ప్లాట్ వైరల్..!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఫౌజీ’ (వర్కింగ్ టైటిల్) ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ చర్చకు దారితీస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో, ముఖ్యంగా 1940ల కాలాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతోంది.

ఈ సినిమాలో ప్రభాస్ పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించబోతున్నాడని సమాచారం. ఒక రెబలియన్‌గా, అన్యాయానికి ఎదురు నిలిచే యోధుడిగా ఆయన పాత్ర డిజైన్ చేసినట్లు టాక్. ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని కోణంలో ప్రభాస్‌ను చూపించేందుకు దర్శకుడు హను రాఘవపూడి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడని తెలుస్తోంది.

‘సీతారామం’ తర్వాత హను తీస్తున్న సినిమా కావడంతో అంచనాలు సహజంగానే పెరిగాయి. హీరోయిన్‌గా ఇమాన్వీ ఇస్మాయిల్ నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయ ప్రద వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇదిలా ఉంటే, ఈ సినిమాకి సంబంధించిన ఒక స్ట్రాంగ్ ప్లాట్ పాయింట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూస్తుంటే నిజంగానే కథ ఇదే అయి ఉండొచ్చని అనిపించేంత పవర్‌ఫుల్‌గా ఉంది. తాజాగా విడుదలైన పోస్టర్ కూడా అదే సూచిస్తోంది. అందులో  హిట్లర్సం  కు బంధించిన రిఫరెన్స్‌లతో పాటు, చంద్రశేఖర్ అజాద్ ఫోటో కనిపించడం ఆసక్తిని మరింత పెంచుతోంది.

కథ మూలం ఏమిటంటే…

1940ల చీకటి కాలంలో, సత్యం చరిత్రలో పూడ్చిపెట్టబడి, అన్యాయం సాధారణంగా మారిన సమయంలో… ఒక యోధుడు మెల్లగా ఎదుగుతాడు. యుద్ధాన్ని విధ్వంసంగా కాకుండా, న్యాయం సాధించే మార్గంగా చూసే వ్యక్తి. అణచివేయబడిన గొంతుకలకు స్వరం ఇవ్వడానికి, దాచిన నిజాలను వెలికితీయడానికి, ప్రతీకారం రూపంలో ముందుకు వచ్చే కథ ఇది.

ఇది కేవలం యుద్ధ కథ కాదు… ఇది ఒక తిరుగుబాటు. చరిత్ర వంగిపోయినప్పుడు, దాన్ని తిరిగి రాయడానికి ముందుకు వచ్చే యోధుడి గాథ.

ఈ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథనం కూడా ఇదే స్థాయిలో బలంగా ఉంటే, ‘ఫౌజీ’ ఖచ్చితంగా ప్రభాస్ కెరీర్‌లోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచిపోయే చిత్రంగా మారే అవకాశముంది.

ఇక విడుదల విషయానికి వస్తే, ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు