ఇటీవల ‘పెద్ది’ సినిమాలో స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారన్నది హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా పూజా హెగ్డే, మానస వారణాసి, సంయుక్త మీనన్ పేర్లు వరుసగా వినిపించాయి. అయితే తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో సర్‌ప్రైజ్ పేరు ఎంటర్ అయ్యింది. అవును… ఈ స్పెషల్ సాంగ్ కోసం కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ ఫైనల్ అయిందనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
శృతి హాసన్ విషయానికి వస్తే, 2014లో విడుదలైన ‘ఎవడు’ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించిన సంగతి తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ హిట్ జోడీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతుండటం ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్‌గా మారనుంది. అదీ ఒక మాస్ స్పెషల్ సాంగ్‌లో అంటే థియేటర్లలో హంగామా ఖాయం. ఈ పాట కోసం శృతి హాసన్‌కు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఒక్క సాంగ్‌కే కోట్లలో ఖర్చు పెడుతున్నారంటే, ఈ నంబర్‌పై మైత్రి మూవీ మేకర్స్ ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థమవుతోంది.
ఇక డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమాలో పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. ఇప్పటికే మూడు పాటల ట్యూన్స్ లాక్ అయ్యాయని, వాటిలో ఈ స్పెషల్ సాంగ్ థియేటర్లను కుదిపేస్తుందన్న ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది. ‘ఐటమ్ సాంగ్’ అంటే దర్శకుడు సుకుమార్ సినిమాల్లో ఎంత స్పెషల్‌గా ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా ‘రంగస్థలం’లో వచ్చిన ‘జిగేల్ రాణి’ పాట ఏ రేంజ్‌లో హిట్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే స్టైల్‌ను తన గురువు బాటలో బుచ్చిబాబు కూడా ‘పెద్ది’లో రిపీట్ చేయబోతున్నాడని తెలుస్తోంది.
ఇక సినిమా విషయానికి వస్తే, ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన లుక్, బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చేశాడు. ఆయనకు జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక మరో స్పెషల్ ఏమిటంటే… దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఏఆర్ రెహమాన్ నేరుగా తెలుగు సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఇప్పుడు అందరి దృష్టి రిలీజ్ డేట్‌పైనే ఉంది. జూన్ 4 లేదా 25న సినిమా విడుదలవుతుందన్న టాక్ వినిపిస్తున్నా, మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








