Search
Close this search box.

  ‘రాకా’ మ్యూజిక్‌కు ఇంటర్నేషనల్ టచ్..!

April 21, 2026 11:41 PM | Aditya369 News

‘రాకా’ మ్యూజిక్‌కు ఇంటర్నేషనల్ టచ్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘రాకా’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. 2027 డిసెంబర్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసిందని సమాచారం. మిగిలిన సమయాన్ని ప్రధానంగా హై క్వాలిటీ VFX పనులకే కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్‌లో అల్లు అర్జున్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించడంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు… సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై భారీ ఆసక్తి పెరిగింది.

మ్యూజిక్‌పై బిగ్ ప్లాన్స్

ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న సాయి అభ్యంకర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘రాకా’ గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఈ చిత్రం గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందుతుండడంతో… మ్యూజిక్ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.

ఇంటర్నేషనల్ టచ్

ప్రపంచవ్యాప్తంగా పేరొందిన సింగర్స్, లిరిసిస్టులతో కలిసి ఈ సినిమాకు పనిచేస్తున్నామని… ఇప్పటికే వచ్చిన అవుట్‌పుట్ చాలా ఎక్సైటింగ్‌గా ఉందని సాయి వెల్లడించారు. ప్రేక్షకులకు ఇది పూర్తిగా కొత్త మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

బన్నీ ఇన్‌పుట్స్ స్పెషల్

అల్లు అర్జున్‌కు సంగీతంపై మంచి అవగాహన ఉందని… ఆయన ఇచ్చిన సూచనలు, ఐడియాలు ప్రాజెక్ట్‌కు చాలా ఉపయోగపడ్డాయని సాయి అభ్యంకర్ తెలిపారు. దీంతో ఈ సినిమాను అట్లీ పూర్తిగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కిస్తున్నాడనే టాక్ మరింత బలపడింది.

హాలీవుడ్ రేంజ్ విజువల్స్

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విజువల్స్‌తో రానుందని తెలుస్తోంది. భారీ VFX, గ్రాండ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఈ సినిమాకి హైలైట్ కానున్నాయి.

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణే నటిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ‘రాకా’ సినిమాతో బన్నీ మరోసారి తన రేంజ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు