మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వారణాసి’ సినిమా నుంచి భారీ అప్డేట్ బయటకు వచ్చింది. దర్శకధీరుడు రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌ను గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లేలా సాలిడ్ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నాడు.
ఏప్రిల్ 24 నుంచి 26 వరకు మెక్సికో సిటీలో జరిగే CCXP 2026 ఈవెంట్లో “Varanasi to the World” పేరుతో ఒక స్పెషల్ విజువల్ గ్లింప్స్‌ను ప్రదర్శించనున్నారు. ఇది మనం రెగ్యులర్‌గా చూసే టీజర్ లేదా ట్రైలర్ కాదు. వరల్డ్‌వైడ్ ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కంటెంట్ అని సమాచారం.
ఈ గ్లింప్స్‌లో ఇప్పటివరకు ఎక్కడా చూడని హై క్వాలిటీ BTS విజువల్స్‌ను చూపించబోతున్నారు. అంతేకాదు, సినిమాలో నటిస్తున్న హీరో, హీరోయిన్‌తో పాటు కీలక పాత్రల వివరాలను కూడా ఈ ఈవెంట్లో రివీల్ చేసే అవకాశం ఉంది. కొన్ని కీలక సన్నివేశాలను కూడా స్క్రీన్ చేసే ఛాన్స్ ఉందని టాక్. దీంతో మనకంటే ముందే మెక్సికో ఆడియన్స్ మహేశ్ బాబు కొత్త మేకోవర్‌ను చూడబోతున్నారు.
ఈ ఈవెంట్ ఏర్పాట్లను కార్తికేయ మెక్సికోలో దగ్గరుండి చూసుకుంటుండగా, రాజమౌళి షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ సినిమా విశేషాలను పంచుకోనున్నాడు. ఈ సందర్భంగా సినిమాలో ఉన్న టైమ్ ట్రావెల్, మైథాలజికల్ ఎలిమెంట్స్‌పై ఏమైనా హింట్స్ ఇస్తాడా అనే ఆసక్తి పెరిగింది.
ఇక సినిమా విషయానికి వస్తే, దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్ నారాయణ దాదాపు 1200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేశ్ బాబుకి జోడీగా ప్రియాంక చోప్రా ‘మందాకినీ’ పాత్రలో కనిపించనుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ఫుల్ నెగటివ్ రోల్లో నటిస్తున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా IMAX ఫార్మాట్లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మొత్తానికి, ఈ సినిమాతో గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేసిన రాజమౌళి, మెక్సికో ఈవెంట్ ద్వారా హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాలని మాస్టర్ ప్లాన్ వేసినట్టే కనిపిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి “Varanasi to the World” గ్లింప్స్పైనే ఉంది.








