పాన్ ఇండియా లెవెల్‌లో భారీ అంచనాలు రేపుతున్న నీల్ – తారక్ కాంబినేషన్ మూవీపై హైప్ రోజురోజుకీ పెరుగుతోంది. అభిమానులు ప్రేమగా “డ్రాగన్” అని పిలుచుకుంటున్న ఈ ప్రాజెక్ట్, తారక్ కెరీర్‌లో 31వ సినిమాగా వస్తుండటం మరింత స్పెషల్.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు సెన్సేషన్ అప్‌డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకటి మేకర్స్ ఇచ్చిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కాగా, మరొకటి సెట్స్ నుంచి లీకైన షాకింగ్ విజువల్స్!
తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందని హీరో స్వయంగా షాడో లుక్ పోస్టర్‌తో ప్రకటించాడు. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇదే కాకుండా, తారక్ బర్త్‌డే సందర్భంగా మే 20న స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించడంతో అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్స్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లాయి.
ఇక ఒకవైపు అఫీషియల్ అప్‌డేట్స్ వస్తుండగానే, మరోవైపు సెట్స్ నుంచి లీకైన ఒక ఫోటో నెట్టింట హాట్ టాపిక్ అయింది.
విదేశీ బాడీబిల్డర్ & యాక్షన్ ఆర్టిస్ట్ శాంటో షేర్ చేసిన ఈ పిక్స్‌లో డైరెక్టర్ నీల్ కూడా కనిపించడం ప్రత్యేకం. వీరి చేతుల్లో గన్స్, సిక్స్‌ప్యాక్ బాడీలు చూస్తే — ఈ సినిమా యాక్షన్ రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతోంది.
ఇక తారక్ కూడా తన స్లీక్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ఇప్పటికే ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేశాడు.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి.
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలకు మ్యూజిక్‌తో ఊపు తీసుకొచ్చిన రవి బస్రూర్ ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్‌గా కన్నడ సెన్సేషన్ రుక్మిణి వసంత్ నటిస్తుండటం కూడా ప్రాజెక్ట్‌కు ప్లస్ పాయింట్.
సెట్స్ నుంచి బయటికి వచ్చిన విజువల్స్ చూస్తే — భారీ సెట్లు, మోడ్రన్ వెపన్స్, ఇంటెన్స్ యాక్షన్… ఇవన్నీ కలిసి ఇది కేవలం మాస్ మూవీ కాదు, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యాక్షన్ డ్రామా అని స్పష్టంగా తెలుస్తోంది.
ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న ఈ సినిమాలో నుంచి తారక్ బర్త్‌డే రోజున రాబోయే గ్లింప్స్ ఎలా ఉంటాయో చూడాలి.
జూన్ 11 రిలీజ్‌కి ముందు ఈ గ్లింప్స్ హైప్‌ను మరింత పెంచడం ఖాయం!








