పెద్దాపురం మండలం తాటిపత్తి గ్రామంలో వేంచేసి యున్న శ్రీ సిద్ది వినాయక ఆలయం నాల్గవ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలతో పాటు ఏకాహం నిర్వహించారు. శ్రీ కోదండరామ భజన బృందం, శ్రీ కనకదుర్గ ఐశ్ళర్యాంబిక మహిళా భజన సమాజం నేతృత్యంలో భక్తి గీతాలాపన భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.









