వాల్ మార్ట్ లో ఒకటైన ప్రముఖ ఫ్లిప్ కార్ట్ సంస్థ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి ఆయన పదవికి రాజీనామా చేశారు. 2017 లో సీఈఓ గా బాధ్యతలు చేపట్టిన కృష్ణమూర్తి రాజీనామా వాల్ మార్ట్ మార్కెట్ రంగాన్ని కుదిపేసింది. కొత్త సీఈఓ వచ్చేవరకు ఆ సంస్థ చీఫ్ ప్రోడక్ట్ అండ్ టెక్నాలజీ అధికారిగా ఉన్న బాలాజీ త్యాగరాజన్ సీఈఓ గా ఫ్లిప్ కార్ట్ సంస్థను నడపనున్నారు. సంస్థ ఐపిఓ ఆలస్యం, సీనియర్ ఉద్యోగులు సంస్థను వదిలేయడం, వంటి అంశాల ప్రభావమే సిఈఓ రాజీనామాకు కారణాలుగా చెబుతున్నారు.









