ప్రతి నటికి తనలోని నటనను నిరూపించుకునే బలమైన పాత్ర చేయాలనే కోరిక ఉంటుందని డింపుల్ అన్నారు. తనలోని నటనపై దృష్టి పెట్టి, కళ్లలోని ఇంటెన్సిటీని గుర్తించిన మొదటి దర్శకుడు సంపత్ నంది అని పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను పోషించిన ‘మందారం’ పాత్ర తన కెరీర్‌కు కొత్త దారిని చూపిస్తుందని చెప్పారు. ఇందులో ఒక్క డ్యాన్స్ కూడా ఉండదని, పూర్తిగా కొత్త డింపుల్ హయాతిని ప్రేక్షకులు చూస్తారని వెల్లడించారు.
ఇక ఈ ప్రాజెక్ట్‌లోకి తాను ఎలా వచ్చానో కూడా డింపుల్ వివరించారు. నిర్మాత రాధామోహన్‌ను మరో సినిమా కథ వినడానికి కలిసిన సమయంలో దర్శకుడు సంపత్ నంది అనుకోకుండా తనను కలిసి ‘డింపుల్.. నేను నీకోసమే ఎదురుచూస్తున్నాను’ అంటూ ‘భోగి’ కథ వినిపించారని తెలిపారు. ‘మందారం’ పాత్ర గురించి విన్న వెంటనే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. తనకు నచ్చిన సినిమాను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన నిర్మాత రాధామోహన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.








