అయితే ప్రస్తుతం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘జనవరి 12 విడుదల’ సినిమా విషయంలో మాత్రం ఈ ఫార్ములా ఆశించిన స్థాయిలో పనిచేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత సినిమాలకు సంగీతం అందించిన భీమ్స్ స్థానంలో ఈసారి జీవీ ప్రకాష్ కుమార్ వచ్చారు. ఆయన నుంచి అదిరిపోయే ట్యూన్ వస్తుందని మ్యూజిక్ లవర్స్ ఆశించారు. అయితే విడుదలైన ఫస్ట్ సింగిల్ మాత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్’ పాటల స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
దీంతో సోషల్ మీడియాలో అనిల్ రావిపూడిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రమోషనల్ వీడియోలపై పెట్టే శ్రద్ధను సినిమా కంటెంట్‌పై కూడా పెట్టాలని కొందరు సూచిస్తున్నారు. సినిమా బాగుంటే ప్రత్యేకమైన ప్రమోషన్లు అవసరం లేదని, ప్రేక్షకుల మౌత్ టాక్‌తోనే మంచి ఆదరణ లభిస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి రెండో పాటతోనైనా అనిల్ రావిపూడి మళ్లీ అంచనాలను పెంచుతారో లేదో చూడాలి.








