కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో పండగ పూట అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక మంగాయమ్మరావు పేటలో నాగం రాంబాబు నివాసంలో ఆయన భార్య మంగతాయారు పండగ వంటకాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.స్టవ్ కు అనుసంధానం గా ఉన్న గ్యాస్ పైపు ఊడిపోయి మంటలు చెలరేగాయి. మంగతాయారుకి స్వల్ప గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.









