గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చి బాబు సాన కాంబినేషన్లో తెరకెక్కుతున్న రా & రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రిలీజ్ డిలే అవుతున్నా, ఈ సినిమాపై క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా బిజినెస్ పరంగా ఈ ప్రాజెక్ట్ సృష్టిస్తున్న హైప్ చూస్తే అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థమవుతోంది.
బిజినెస్‌లో రికార్డ్ డీల్స్
ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, ఉత్తరాంధ్ర (వైజాగ్) థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టు టాక్. సుమారు ₹23 కోట్ల రేంజ్లో డీల్ క్లోజ్ అయినట్టు వినిపిస్తోంది. ఒక్క ఏరియాకే ఈ స్థాయి రేటు రావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. గత సినిమా గేమ్ చేంజర్ ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా, ‘పెద్ది’పై ఈ స్థాయి బజ్ ఉండటం విశేషం.
స్పెషల్ సాంగ్‌పై హైప్
ఇక ఈ సినిమాలో ఒక మాస్ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ పాటలో ఎవరు కనిపిస్తారు అన్న దానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడిచింది. మృణాల ఠాకూర్, పూజ హెగ్డే, మానస వారణాసి వంటి పేర్లు వినిపించినా, తాజా సమాచారం ప్రకారం ‘గోల్డెన్ లెగ్’ సంయుక్త మీనన్ ఫైనల్ అయినట్టు టాక్. ఆమె ఇప్పటికే అఖండ 2లో చేసిన స్పెషల్ సాంగ్‌తో ఆకట్టుకుంది. ఇప్పుడు A. R. రెహమాన్ కంపోజ్ చేసిన మాస్ ట్యూన్‌కు రామ్ చరణ్‌తో కలిసి స్టెప్పులు వేయబోతుందనే వార్త ఫ్యాన్స్‌లో ఎగ్జైట్మెంట్ పెంచుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రిలీజ్‌పై సస్పెన్స్
మొదట ఈ సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతం షూటింగ్లో కొంత భాగం, ముఖ్యంగా స్పెషల్ సాంగ్, ప్యాచ్ వర్క్ ఇంకా బ్యాలెన్స్‌లో ఉన్నాయని సమాచారం. కొన్ని సీన్స్ రీషూట్ చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా జూన్ 4 లేదా జూన్ 25న విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి, రిలీజ్ ఎప్పుడు జరిగినా Peddi బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించడం ఖాయం అన్న నమ్మకాన్ని ఈ బిజినెస్ డీల్స్ స్పష్టంగా చూపిస్తున్నాయి.









