కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం గా చేతలలో చేసి చూపించడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు.కరపలో మూడో విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సొమ్ములు విడుదల కార్యక్రమం వ్యవసాధికారులు ఏవో ఐ సత్య అధ్యక్షతన ”చంద్రన్న సమావేశ మందిరంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామన్నారు.ఎరువులు కొరత లేకుండా చూస్తామని,కాలువల ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు.గత ప్రభుత్వం రైతుల వద్ద నుండి భూములు లాక్కునేందుకు ప్రయత్నం చేసిన యాక్టును కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు పేర్కొన్నారు.అనంతరం రైతులకు అన్నదాన సుఖీభవ చెక్కును పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ, సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి,మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు,పెంకె శ్రీనివాస్ బాబా,చప్పిడి వెంకటేశ్వరరావు,ఏఎంసీ చైర్మన్ ముద్రగడ రమేష్, కటకం శెట్టి బాబి,ఆత్మ చైర్మన్ గొల్లపల్లి చంద్రశేఖర్, భోగి రెడ్డి కొండబాబు,నల్లే ప్రసన్నకుమార్,దూడల నారాయుడు,వెలుగుబంట్ల సూరిబాబు,తాతాజీ, టి గోవిందరాజులు, రెడ్డిపల్లి నారాయణరావు, ఎంపీడీవో జెశ్రీనివాసరావు, ఏ డి ఏ బాబురావు తదితరులు పాల్గొన్నారు.









