అరుదైన పునుగు జాతికి చెందిన మానుపిల్లి కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రత్యక్షమైంది. స్థానిక పాట బస్టాండ్ సెంటర్లో పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న డివైడర్ పై అది కదల్లేని స్థితిలో ఉండిపోయింది. ఒంటినిండా రక్తపు గాయాలు ఉన్నాయి. సాధారణంగా చెట్లపై ఉండే ఈ పిల్లి జనావాసాల మధ్యకు రావడంతో కుక్కలు వెంబడించి కరిచినట్లు స్థానికులు చెబుతున్నారు. కదలని స్థితిలో ఉన్న పిల్లిని స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు. అధికారులకు సమాచారం ఇచ్చారు.









