Search
Close this search box.

  హనుమాన్ విగ్రహంపై విద్వేషం: ‘మాగా’ నేత వ్యాఖ్యలపై నెటిజన్ల ఆగ్రహం

February 19, 2026 6:00 PM | Aditya369 News

హనుమాన్ విగ్రహంపై విద్వేషం: ‘మాగా’ నేత వ్యాఖ్యలపై నెటిజన్ల ఆగ్రహం

టెక్సాస్‌ రాష్ట్రం హ్యూస్టన్ సమీపంలోని షుగర్ ల్యాండ్‌లో గల అష్టలక్ష్మి ఆలయం వద్ద 90 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహాన్ని (స్టాచ్యూ ఆఫ్ యూనియన్) 2024లో ప్రతిష్టించారు. ఇది ఉత్తర అమెరికాలోనే అత్యంత ఎత్తైన విగ్రహాల్లో ఒకటి. అయితే, రిపబ్లికన్ పార్టీకి చెందిన కార్లోస్ టర్కియోస్ ఈ విగ్రహాన్ని ఉద్దేశించి, "ఇది న్యూఢిల్లీనో, ఇస్లామాబాద్‌నో కాదు.. ఇది టెక్సాస్.. మూడో ప్రపంచపు ఏలియన్స్ అమెరికాను ఆక్రమిస్తున్నారు.. ఈ దురాక్రమణను ఆపండి" అంటూ ఎక్స్‌ (ట్విట్టర్)లో విషం చిమ్మారు.
ఈ వ్యాఖ్యలపై భారతీయ సమాజం మరియు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. అమెరికాలో భారతీయులు అత్యంత విజయవంతమైన మరియు విద్యావంతులైన వర్గమని, వారిని ఏలియన్స్ అనడం టర్కియోస్ అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. ఒక నెటిజన్ స్పందిస్తూ, "అమెరికాలో 41 మిలియన్ల మంది స్పానిష్ మాట్లాడేవారు ఉన్నారని, ఆ జాబితాలో భారతీయ భాషలు టాప్-10లో కూడా లేవని, అంటే భారతీయులు అమెరికా సంస్కృతిలో ఎంతగా కలిసిపోయారో అర్థం చేసుకోవాలని" హితవు పలికారు.
గతంలో కూడా అలెగ్జాండర్ డంకన్ వంటి మరికొందరు రిపబ్లికన్ నేతలు ఈ విగ్రహాన్ని "తప్పుడు దేవుడి విగ్రహం" అని విమర్శించి వివాదాలకు దారితీశారు. అయితే, అమెరికా రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ప్రకారం, ప్రైవేట్ స్థలంలో తమకు నచ్చిన దైవాన్ని ఆరాధించే హక్కు ఎవరికైనా ఉంటుందని హిందూ అమెరికన్ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విగ్రహం కేవలం భక్తికి చిహ్నం మాత్రమే కాదని, శాంతికి ఆధ్యాత్మిక కేంద్రమని భక్తులు పునరుద్ఘాటిస్తున్నారు.

టెక్సాస్‌ రాష్ట్రం హ్యూస్టన్ సమీపంలోని షుగర్ ల్యాండ్‌లో గల అష్టలక్ష్మి ఆలయం వద్ద 90 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహాన్ని (స్టాచ్యూ ఆఫ్ యూనియన్) 2024లో ప్రతిష్టించారు. ఇది ఉత్తర అమెరికాలోనే అత్యంత ఎత్తైన విగ్రహాల్లో ఒకటి. అయితే, రిపబ్లికన్ పార్టీకి చెందిన కార్లోస్ టర్కియోస్ ఈ విగ్రహాన్ని ఉద్దేశించి, “ఇది న్యూఢిల్లీనో, ఇస్లామాబాద్‌నో కాదు.. ఇది టెక్సాస్.. మూడో ప్రపంచపు ఏలియన్స్ అమెరికాను ఆక్రమిస్తున్నారు.. ఈ దురాక్రమణను ఆపండి” అంటూ ఎక్స్‌ (ట్విట్టర్)లో విషం చిమ్మారు.

ఈ వ్యాఖ్యలపై భారతీయ సమాజం మరియు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. అమెరికాలో భారతీయులు అత్యంత విజయవంతమైన మరియు విద్యావంతులైన వర్గమని, వారిని ఏలియన్స్ అనడం టర్కియోస్ అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. ఒక నెటిజన్ స్పందిస్తూ, “అమెరికాలో 41 మిలియన్ల మంది స్పానిష్ మాట్లాడేవారు ఉన్నారని, ఆ జాబితాలో భారతీయ భాషలు టాప్-10లో కూడా లేవని, అంటే భారతీయులు అమెరికా సంస్కృతిలో ఎంతగా కలిసిపోయారో అర్థం చేసుకోవాలని” హితవు పలికారు.

గతంలో కూడా అలెగ్జాండర్ డంకన్ వంటి మరికొందరు రిపబ్లికన్ నేతలు ఈ విగ్రహాన్ని “తప్పుడు దేవుడి విగ్రహం” అని విమర్శించి వివాదాలకు దారితీశారు. అయితే, అమెరికా రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ప్రకారం, ప్రైవేట్ స్థలంలో తమకు నచ్చిన దైవాన్ని ఆరాధించే హక్కు ఎవరికైనా ఉంటుందని హిందూ అమెరికన్ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విగ్రహం కేవలం భక్తికి చిహ్నం మాత్రమే కాదని, శాంతికి ఆధ్యాత్మిక కేంద్రమని భక్తులు పునరుద్ఘాటిస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు