గొల్లప్రోలు మండలంలోని తాటిపర్తి జడ్పీ హైస్కూల్లో బాల్య వివాహ ముక్త భారత కార్యక్రమం నిర్వహించారు.ఈ సమావేశానికి జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి దుర్గారాణి, ఐసిడిఎస్ సూపర్వైజర్ ఏం. దేవకుమారి హాజరయ్యి మాట్లాడుతూ బాల్య వివాహా రహిత దేశంగా భారత దేశాన్ని తీర్చి దిద్దాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలను విద్యా రంగ సంస్థలలో నిర్వహించడం జరుగుతున్నదన్నారు.బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం, నేరం అని చిన్న తనంలో బాల్యవివాహాలు చేయడం వలన శారీరకంగా, మానసికంగా పరిపక్వత చెందరని, అనేక సమస్యలను ఎదుర్కొంటారన్నారు.బాల్య వివాహాలు నుండి బాలలను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడు పై ఉందన్నారు.బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ, ప్రభుత్వ అధికారులకు లేదా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. విద్యార్థులు ఆకతాయిల మాటలకు, ప్లోభాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమములో పాఠశాల ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు అంగన్వాడి కార్యకర్తలు,విద్యార్థులు పాల్గొన్నారు.









