కాకినాడ జిల్లా తిమ్మాపురం-మాధవపట్నం నూతన హైవే వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుండి కాకినాడ వస్తున్న కారును టిప్పర్ లారీ బలంగా ఢీకొ ట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న విశాఖపట్నంకు చెందిన సుంకర వెంకట పద్మావతి, కొల్లు దీప్తి అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జ యింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న కొల్లు ప్రదీప్ ప్రాణాలతో బయటపడ్డాడు.








