మార్చి 2026 లో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్,ఒకసారి ఫెయిల్ అయిన అభ్యర్థులకు పరీక్ష రుసుము చెల్లించడానికి ప్రభుత్వం తత్కాల్ పథకం అవకాశం కల్పించింది.పిబ్రవరి 6 నుండి 12 తేదీ వరకు ఆ పధకం ద్వార పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.అన్ని పాఠశాలల విద్యాసంస్థల అధిపతులు www.bse.ap.gov.in వెబ్సైట్లో ఇప్పటికే వారికి ఇవ్వబడిన యూజర్ ఐడి,పాస్వర్డ్ ద్వార యూజర్ మాన్యువల్‌ను అనుసరించి పాఠశాల లాగిన్ ద్వారా ఆన్లైన్లో రుసుము చెల్లించాలి.









