Search
Close this search box.

  ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

February 5, 2026 12:24 AM | Aditya369 News

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

తెలంగాణలో నిజామాబాద్‌లో గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయ పడి,చికిత్స పొందుతూ మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతిని నిరసిస్తూ,మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పిఠాపురం రదాలపేట అంబేద్కర్ విగ్రహం వద్ద మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ,జెవివి,ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా మద్యం మాదక ద్రవ్యాల ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ ఎన్ సూర్యనారాయణ,నాయకులు కె అప్పా రావు,విఎస్ రెడ్డి,వి సూర్యనారాయణలు మాట్లాడుతూ ప్రతిరోజూ ఏదో ఒకచోట గంజాయి మాఫియా దాడులు జరుగుతున్నా ప్రభుత్వ,పోలీస్‌ యంత్రాంగం స్పందిస్తున్న తీరు అన్యాయంగా ఉందని విమర్శించారు.డ్రగ్స్‌,గంజాయి మాఫియా ముఠా తమ లాభాలు కోసం పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు వాటిని అలవాటు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.కౌమర దశ యువతే లక్ష్యంగా మాఫియా ముఠా పనిచేస్తోందని తెలిపారు. పోలీసుల ప్రాణాలకే రక్షణ లేదని పేర్కొన్నారు.ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో మద్యం మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ జనవిజ్ఞాన వేదిక, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు