పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చారిత్రాత్మక చిత్రం ‘హరి హర వీర మల్లు’ ఎట్టకేలకు ఎంతో కాలం ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట క్రిష్ జాగర్లమూడి ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌ను, తర్వాత జ్యోతికృష్ణ పూర్తి చేశారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనగా, సినిమా వాటిని ఎంతవరకు అందుకుందో చూద్దాం.
కథం ఓ చారిత్రక యోధుడి పోరాటం
ఈ సినిమా కథ 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగుతుంది. సామాజిక సత్యం కోసం పోరాడే వీరుడు హరి హర వీర మల్లు (పవన్ కళ్యాణ్), ధనవంతుల నుంచి దోచుకుని పేదల్ని ఆదుకుంటాడు. ఒకప్పటి కోహినూర్ వజ్రాన్ని ఔరంగజేబు వద్ద నుంచి తేవాలని కోరిన అక్కన్న-మాదన్నల ఒప్పందం ద్వారా, వీర మల్లు ఢిల్లీ పయనం ప్రారంభిస్తాడు.ఈ ప్రయాణంలో ప్రేమ, దేశభక్తి, వ్యూహాలు, విశ్వాసం – అన్నింటిని చొప్పించేందుకు దర్శకులు ప్రయత్నించారు. కానీ కథనం ఎక్కడైతే ఆసక్తికరంగా మారాల్సిందో, అక్కడ మాత్రం నెమ్మదితనం, అలసత్వం కనిపిస్తుంది..
పవన్ కళ్యాణ్ – వన్ మన్ ఆర్మీ
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చూపించిన ఎనర్జీకి ఎలాంటి తగ్గేదే లేదు. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్యాన్స్‌కు పండగలా ఉంటుంది. ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, క్యారిజ్మా సినిమా స్థాయిని ఓ రేంజ్‌లో తీసుకెళ్లాయి..నిధి అగర్వాల్ నటన ఓకే గానే ఉంది కానీ పాత్రకు బలం లేకపోవడం వల్ల అంతగా గుర్తుండిపోదు. బాబీ డియోల్ ఔరంగజేబుగా బాగా పండిపోయారు. సత్యరాజ్, ఈశ్వరీ రావు, కబీర్ సింగ్, సునీల్, రఘుబాబు వంటి వారు తమ తమ పాత్రలలో న్యాయం చేశారు. కోట కామెడీ సన్నివేశాల్లో అలరించారు.
కీరవాణి సంగీతం మరోసారి మ్యాజిక్ చేశాడు. పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాల్లో సినిమాకు జీవం పోసింది.
సినిమాటోగ్రఫీ బాగుంది, కానీ రెండు డిఫరెంట్ కెమెరామెన్‌ల వర్క్ వల్ల కట్‌లో కొంత అసమరస్యత కనిపించింది.
ఆర్ట్ డిజైన్ (తోట తరణి) అద్భుతం. మొఘల్ యుగాన్ని రిచ్‌గా చూపించగలిగారు.
వీఎఫ్‌ఎక్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం ప్రధాన మైనస్. కొన్ని విజువల్స్ బాగా డిజైన్ చేసినా, క్లైమాక్స్‌లో సీరియస్‌నెస్ తగ్గింది..









