హీరో మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప’ చిత్రం విడుదలకు ముందే కష్టాల్లో చిక్కుకుంది. చిత్రానికి సంబంధించి అత్యంత కీలకమైన హార్డ్‌డ్రైవ్ అపహరణ జరిగిందని, చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫిలింనగర్ లో కలకలం రేగింది..
కోకాపేట కు చెందిన రెడ్డి విజయ్‌కుమార్, ట్వంట్వీఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. కన్నప్పచిత్రానికి సంబంధించిన కీలక కంటెంట్ కలిగిన హార్డ్‌డ్రైవ్ ను ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ నుండి ఫిలింనగర్ లోని విజయ్‌కుమార్ కార్యాలయానికి కొరియర్ ద్వారా పంపించారు. 25వ తేదీ న ఆ కొరియర్ పార్శిల్‌ను ఆఫీస్‌బాయ్ రఘు అందుకున్నాడు. అయితే, రఘు ఆ పార్శిల్‌ను ఎవరికి తెలియకుండా, చరిత అనే మహిళకు అప్పగించాడని, ఆ తర్వాత రఘు, చరిత ఇద్దరూ కనిపించకుండా పోయినట్టు తెలుస్తోంది..
విజయ్‌కుమార్ తన ఫిర్యాదులో ఈ సంఘటనను సంఘటిత కుట్ర అని, సినిమా ప్రాజెక్టుకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించేందుకు ఇది చేసిన చర్యలని పేర్కొన్నారు. రఘు మరియు చరిత ఈ మొత్తం అపహరణ ఘటనకు గుర్తుతెలియని వ్యక్తుల మార్గనిర్దేశంలో పాలుపంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు..
ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది.. ఈ సినిమాలో కీలక పాత్రలో ప్రభాస్, అక్షయ్ కుమార్,మోహన్ లాల్,కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం నటిస్తున్నారు..









