త్రిపుల్ ఆర్ తర్వాత శంకర్ డైరెక్షన్లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో, రామ్ చరణ్ అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు.. ప్రస్తుతం రామ్ చరణ్b’పెద్ది’ అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నారు.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి… ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది.. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు సమాచారం..ఇక ఈ సినిమా తర్వాత చరణ్ – సుకుమార్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతున్న విషయం తెలిసిందే..రంగస్థలం చరణ్, సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి..
అయితే తాజాగా, చరణ్ మరో కొత్త డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడన్న వార్త ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో OG తెరకెక్కిస్తున్న సుజిత్..
OG సినిమా భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్‌లో ఉంది.. రామ్ చరణ్ కోసం స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ కథను డైరెక్టర్ సుజిత్ సిద్ధం చేసినట్లు సమాచారం.. ఈ కథను రామ్ చరణ్ కు చెప్పి ఒప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది..
OG తరువాత హీరో నానితో సుజిత్ సినిమా ఉంటుంది.. అంతలో రామ్ చరణ్ సుకుమార్ సినిమా చేస్తాడు.. ఆ తర్వాత చరణ్, సుజిత్ కాంబో ఉండబోతున్నట్లు సమాచారం.. ఇప్పుడు రామ్ చరణ్ కోసం ఈ నేపథ్యంలో చరణ్ – సుజిత్ కాంబో నిజమవుతుందా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.. OG నిర్మాత DVV దానయ్య – RRR ఫేం – ఈ ప్రాజెక్ట్‌కూ నిర్మాతగా ఉండే అవకాశాలు ఉన్నాయి..ఈ బిజీ షెడ్యూల్ మధ్యలో సుజిత్ స్క్రిప్ట్‌కి చరణ్ డేట్స్ ఇవ్వగలడా అన్నదే ప్రశ్న… మరోవైపు, నానితో సుజిత్ సినిమా కూడా ‘పారడైజ్’ పూర్తయ్యేంతవరకు డిలే కావొచ్చు.. దీంతో OG విడుదల అయ్యే సమయానికి పరిస్థితులు మారే అవకాశం ఉంది.. OG బ్లాక్‌బస్టర్ అయితే, సుజిత్‌కి క్రేజ్ పెరిగి, స్టార్ హీరోలు క్యూ కట్టే పరిస్థితి రాకపోలేదు.. అప్పుడు రామ్ చరణ్ – సుజిత్ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది..









