Search
Close this search box.

  రామ్ చరణ్, సుకుమార్ సినిమా నుండి క్రేజీ అప్డేట్..!

ప్రస్తుతం రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న “పెద్ది” సినిమాపై భారీ అంచనాలున్నాయి.. చరణ్ మాస్ & ఇమోషనల్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజిలో భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటోంది.. ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన లుక్ ను పూర్తిగా చేంజ్ చేశాడు.. రామ్ చరణ్ లుక్ చూస్తుంటే రంగస్థలం వైబ్ వస్తున్నాయి.. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 30% కంప్లీట్ అయ్యింది.. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది.. శివ రాజ్ కుమార్, ద్వివేందు కీలక పాత్రలో నటిస్తున్నారు.. ఏ.ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు..అయితే ఈ సినిమా తర్వాత చరణ్ – సుకుమార్ కాంబోలో RC17 తెరకెక్కనుందని ఎప్పటినుంచో వార్తలు ఉన్నప్పటికీ,

అధికారికంగా గాని లేదా వర్క్ అప్‌డేట్స్ పరంగా గాని ఏమి రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు. కానీ తాజాగా సుకుమార్ స్వయంగా ఈ సినిమా గురించి తన స్వగ్రామం మలికిపురంలో మాట్లాడుతూ

“నా నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ తోనే. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు చేస్తున్నాం” అని చెప్పడం వలన ఆ rc17 పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.. ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. బుచ్చిబాబు సినిమా పూర్తయిన తర్వాత వెంటనే సుకుమార్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన “రంగస్థలం” ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే.. తర్వాత వీరి కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉండటం సహజం..మరి ఇప్పుడు RC17తో సుకుమార్, చరణ్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ విధ్వంసం చేస్తారో చూడాలి..

 

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు