ప్రపంచవ్యాప్తంగా సినీ ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్న సినిమా SSMB29.. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. “బాహుబలి”, “RRR” వంటి చిత్రాలతో ఇంటర్నేషనల్ రేంజ్‌కు ఎదిగిన జక్కన్న, ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబును ఎలా చూపించబోతున్నాడో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ వేగంగా జరుగుతోంది… రాజమౌళి సినిమాలంటే , గ్రాండియర్ భారీ విజువల్స్ తో పాటు హై యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి.. ఇప్పటికే కొన్ని కీలక పాత్రల్లో స్టార్ నటులను ఎంపిక చేసిన రాజమౌళి, తాజా సమాచారం ప్రకారం మరో స్టార్ హీరో ను ఓ కీలక రోల్ కి రాజమౌళి ఒప్పించినట్లు సమాచారం..పాన్ ఇండియా స్టార్ విక్రమ్ ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు కూడా రూమర్స్ రూపంలో మొదలై, తర్వాత అధికారికంగా ప్రకటించబడినట్టే, విక్రమ్ విషయంలో కూడా అదే జరగబోతుందన్న అంచనాలు బలంగా ఉన్నాయి.. ఇప్పటికే ఈ సినిమా భారీ స్టార్ క్యాస్ట్ తో వస్తుంది.. ఇప్పుడు మరో స్టార్ హీరో చేరడంతో ఈ సినిమా హైప్ మరింత పెరిగింది.. రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడో అన్న ఊహాగానాలు ఇప్పటి నుండే మొదలు అయ్యాయి… ఈ ప్రాజెక్ట్‌కు దాదాపు రూ. 1000 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది.. సినిమాటోగ్రఫీకి పీఎస్ వినోద్, సంగీతానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎం.ఎం. కీరవాణి బాధ్యత వహించనున్నారు. ఈ కలయిక సినిమాను విజువల్ వండర్‌గా మార్చనుంది…మే నుంచి జూన్ వరకు షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుండగా, హైదరాబాద్‌లో ప్రత్యేకంగా భారీ సెట్‌లు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అన్ని దశలు పూర్తయిన తర్వాత 2026లో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనే ప్లాన్ ఉన్నట్లు సమాచారం..









