Search
Close this search box.

  “జై హనుమాన్” సినిమా నుండి క్రేజీ అప్డేట్..! ఇక గ్లోబల్ లెవెల్లో..

సూపర్ హీరో సినిమాలను తెలుగుతెరకు పరిచయం చేసిన దర్శకుల్లో ప్రశాంత్ వర్మకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.. తేజా సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హను మాన్’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అంచనాలను మించిపోయేలా కథ, విజువల్స్, ఎమోషన్‌తో అలరిస్తూ, తెలుగు సినిమా స్థాయిని మరో లెవల్‌కి తీసుకెళ్లింది.. ఈ సినిమా కలెక్షన్ లతో పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపింది.. ఇక ఈ సినిమాకి సీక్వెల్ ఉన్నట్లు.. దర్శకుడు సినిమా చివరలో ప్రకటించిన విషయం తెలిసిందే.. ‘జై హనుమాన్’అంటూ సీక్వెల్‌తో మళ్లీ సందడి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి టైటిల్ రోల్‌లో కన్నడ పవర్‌హౌస్ రిషబ్ శెట్టి నటించనున్నట్లు అధికారికంగా వెల్లడైంది. ‘కాంతారా’తో నేషనల్ లెవెల్‌లో గుర్తింపు పొందిన రిషబ్ ఈ సినిమాలో హీరోగా నటించబోతుండటంతో ప్రాజెక్ట్‌కు భారీ హైప్ ఏర్పడింది.. ఐతే ఈ సినిమా నుండి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..ఈ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, తాజాగా మరో బిగ్ అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనట్టు సమాచారం. ఆయన సమర్పణలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది..ఈ రేంజ్ సపోర్ట్‌తో ‘జై హనుమాన్’ ఓ రికార్డ్ బ్రేకింగ్ ప్యాన్ ఇండియా మూవీగా నిలవబోతోందన్న అంచనాలు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి..ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతుండగా, సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభం కానుందని సమాచారం. భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక టెక్నాలజీతో తెరకెక్కబోయే ఈ చిత్రం ప్రేక్షకుల్ని మరోసారి విభిన్నమైన సినిమాటిక్ యూనివర్స్‌లోకి తీసుకెళ్లనుంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు