Search
Close this search box.

  వెంకీ, నానితో త్రివిక్రమ్ మల్టీస్టారర్..?

డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ కోసం ఓ మైథాలజికల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.. ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాలో త్రివిక్రమ్ నాని, వెంకటేశ్ కాంబో పై న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. ఇక మ్యాటర్ లోకి వెళ్తే త్రివిక్రమ్ నాని, వెంకటేష్ తో కలిసి గతంలో ఓ మల్టీస్టారర్ తెరకెక్కించాలని ప్రయతించడాట..నాని హీరోగా గౌతం దర్శకత్వం లో వచ్చిన జెర్సీ మూవీ ఈవెంట్ కు వెంకటేష్ చీఫ్ గెస్ట్ వచ్చారు.. ఇదే ఈవెంట్ కు త్రివిక్రమ్ కూడా వచ్చారు.. అయితే ఈవెంట్ తర్వాత త్రివిక్రమ్ వీళ్ళతో కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా తీయాలి అని ఫిక్స్ అయ్యి కథ కూడా రాసాడటా.. ఈ కథను సితార బ్యానర్ ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా చెప్పాడట.. ఈ నాగవంశీకి కూడా కథ నచ్చడంతో సినిమా ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఒప్పుకున్నాడట.. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ చెప్పాడు.. కానీ కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.. ఇప్పుడే ఇదే ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తుంది.. బన్నీ అట్లీ సినిమా కోసం రెండేళ్లు డేట్స్ ఇచ్చాడట.. ఆ గ్యాప్ లో ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి తర్వాత బన్నీ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు సమాచారం.. వెంకటేష్‌తో డైరెక్ట్‌గా త్రివిక్రమ్ చేస్తే, అది ఓ రిఫ్రెషింగ్ కాంబినేషన్ అవుతుంది. “నువ్వు నాకు నచ్చావ్” లాంటి ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మళ్లీ వస్తుందా అన్న ఆశ ఉండడం సహజం. త్రివిక్రమ్ రాసిన స్క్రిప్ట్‌ను వెంకటేష్ చెప్పడం అంటే, అది స్క్రీన్ మీద క్లిక్ అవ్వడం ఖాయం అనే నమ్మకం చాలామందిలో ఉంది. చూడాలి మరి ఈ కాంబో ఎలాంటి సినిమా వస్తుందో..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు