ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా గురించి ఊహాగానాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ ను తీసుకోవాలని పక్కా ప్లాన్ జరుగుతోందట. ఇది నిజమైతే, ఇది కచ్చితంగా సినిమాకి నేషనల్ వైడ్ హైప్ తీసుకొస్తుంది..‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం, ఎన్టీఆర్ కెరీర్‌లో మైలురాయిగా నిలవబోతోందన్న టాక్ ఉంది… రణ్ వీర్ సింగ్ పాత్ర ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర అని ప్రచారం జరుగుతోంది. ఇది కీ రోల్ కావడంతో, కథలో పెద్ద మలుపు ఇచ్చే ఛాన్స్ ఉంది.
ప్రశాంత్ నీల్ ఇప్పటికే స్క్రిప్ట్‌ను చాలా సాలిడ్‌గా రెడీ చేశారట – ఇది ఆయన ఇప్పటి వరకూ తీసిన సినిమాల కంటే గొప్పదిగా ఉండబోతుందని బజ్..
రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండటంతో, మ్యూజికల్‌గా కూడా భారీ స్థాయి అంచనాలున్నాయి…
మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ వంటి టాప్ బ్యానర్లపై నిర్మాణం జరుగుతుండటంతో ప్రాజెక్ట్ గ్రాండియర్ మరింత పెరిగింది..ఈ రూమర్ నిజమైతే, ఎన్టీఆర్ – రణ్ వీర్ కాంబినేషన్ స్క్రీన్ మీద ఉండే ఛాన్స్ ఉంది. రణ్ వీర్ సింగ్ పాత్ర గురించి అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందా అని ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…









