గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. టైటిల్, ఫస్ట్ లుక్, మాస్ లుక్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. బుచ్చిబాబు దర్శకత్వంలో, AR రెహమాన్ సంగీతం, మరియు శివరాజ్ కుమార్ స్టార్ భారీ క్యాస్ట్ ఉన్న , సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి.
“రంగస్థలం” తర్వాత చరణ్ నుంచి మళ్లీ ఒక మాస్ అవతార్ లో పెద్ది సినిమాలో కనిపించబోతున్నారు.. అయితే “గేమ్ ఛేంజర్” లాంటి సినిమా తర్వాత రామ్ చరణ్ చాలా విమర్శల ఎదుర్కొన్నాడు.. ఇప్పుడు పెద్ది ఫస్ట్ లుక్ తో విమర్శలకు చెక్ పెట్టాడు రామ్ చరణ్.., “పెద్ది”తో చరణ్ మళ్లీ తన మాస్ ను చూపించేలా ఉన్నాడు..
ఈ సినిమాను సమ్మర్ 2026 మార్చి 26 విడుదలకు చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.. అయితే ఇది వాస్తవమైతే, రామ్ చరణ్ సినిమా విడుదలకు అది మంచి డేట్ అవుతుందని చెప్పవచ్చు..









