Search
Close this search box.

  బ్రిట‌న్‌ పార్లమెంట్లో మెగాస్టార్ కు అవార్డు..! ఎప్పుడంటే..?

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి బ్రిటన్‌ ప్రభుత్వం ఒక అరుదైన గౌరవాన్ని అందిస్తోంది…ఆయన సినీ రంగంలో మరియు స‌మాజ సేవలో నాలుగు దశాబ్దాలుగా చేసిన అద్భుతమైన కృషికి గుర్తింపుగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ ను ప్రకటించింది. ఈ అవార్డు మార్చి 19న యూకే పార్లమెంటు హౌస్ ఆఫ్ కామన్సులో చిరంజీవికి అందజేయనున్నారు…బ్రిటన్‌లోని లేబర్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు నవేందు మిశ్రా, మరియు ఇతర ప్రముఖ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ, చిరంజీవి చేసిన సేవలను గుర్తించి, కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం ఈ పురస్కారం అందిస్తోంది…బ్రిడ్జ్ ఇండియా, యూకేలో ప్రముఖ పబ్లిక్ పాలసీ సంస్థగా పేరు పొందింది. ఈ సంస్థ వివిధ రంగాల్లో ప్రగతి సాధించిన వారిని, వారి సమాజంపై చూపించిన ప్ర‌భావం ద్వారా మరింత గుర్తింపు పొందడానికి ప్రతిష్టాత్మక అవార్డులు ప్రదానం చేస్తుంది. చిరంజీవి ఈ అవార్డును అందుకునే తొలి వ్యక్తిగా నిలవడం విశేషం…ఇదిలా ఉంటే, 2024లో భారత ప్రభుత్వం నుంచి చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం పొందారు. అలాగే, గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో అత్యంత సమర్ధవంతమైన నటుడు, డ్యాన్సర్‌గా స్థానం సాధించారు…2024లో, అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆయ‌న‌కు ప్రతిష్టాత్మక ఎ.ఎన్‌.ఆర్ జాతీయ అవార్డును కూడా ప్రదానం చేసింది…

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు