గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చి బాబు దర్శకత్వంలో వస్తున్న టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టు RC 16.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో లో ఓ భారీ సెట్ లో జరుగుతున్నట్లు సమాచారం.. ఈ సినిమాలో రామ్ చరణ్ రంగస్థలం లో చిట్టిబాబు లాంటి ఓ పాత్రలో కనిపిస్తారని సమాచారం..ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే రూరల్ డ్రామా గా రాబోతుంది.. ఈ సినిమా ప్రస్తుతం RC 16 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది.. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.. మిర్జాపూర్ నటుడు మున్నాభాయ్ రామ్ చరణ్ స్నేహితుడి పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది.. ఈ సినిమా పై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. దాంతో ఈ సినిమా నుండి ఎటువంటి వార్త బయటికి వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతుంది.. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ లుక్ ను రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా రిలీజ్ చేస్తానని డైరెక్టర్ బుచ్చి బాబు ఓ వేడుకలో చెప్పారు.. ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది..అదేంటంటే ఈ సినిమా ఓటిటి రైట్స్ ను ప్రముఖ ఓటిటి సంస్థ సోనీ లీవ్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. రామ్ చరణ్ కేరియర్లోనే హైయెస్ట్ ధరకు కొనగోలు చేసినట్లు సమాచారం.. ఈ సినిమా పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాల్లో టాక్.. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు..









