ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ కొనసాగుతుంది.. టాలీవుడ్ లో రాజమౌళి డైరెక్షన్లో భారీ బడ్జెట్ సినిమా ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా నటించి మెప్పించారు.. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద 1200 కోట్ల పైగా వసూళ్లు రాబట్టి భారీ హిట్ గా నిలిచింది.. దాంతో టాలీవుడ్ తో పాటు చాలా ఇండస్ట్రీ లో మల్టి స్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.. ఇతర ఇండస్ట్రీ వాళ్ళు మన సినిమాలో యాక్ట్ చేయడం. మన వాళ్ళు ఇతర ఇండస్ట్రీ సినిమాల్లో కీలక పాత్రలు చేయడం.. ఇలా మల్టీ స్టారర్ ట్రెండ్ కొనసాగుతుంది.. అలాంటి మల్టి స్టారర్ సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ భారీ మల్టీస్టారర్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది “వార్ 2”.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.. ఫస్ట్ పార్ట్ వార్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఇందులో ఓ కీలక పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు.. ఎన్టీఆర్,హృతిక్ రోషన్ కు మధ్య వచ్చే సీన్స్ ఈ సినిమాకు హైలెట్ గా ఉండబోతున్నాయని బాలీవుడ్ వర్గాల్లో టాక్.. ఈ సినిమాకు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్లోను భారీ అంచనాలు ఉన్నాయి .. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఫస్ట్ డైరెక్ట్ బాలీవుడ్ సినిమా చేస్తున్నాడు.. ఎన్టీఆర్ సంబంధించిన షూట్ కంప్లీట్ స్టేజ్ కు వచ్చిందని.. బాలీవుడ్ వర్గాల్లో సమాచారం.. ఐతే ఇప్పటి వరకు కూడా ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ లేదు. కనీసం ఎన్టీఆర్, హృతిక్ సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు.. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.. ఎన్టీఆర్ సినిమా చేస్తున్నట్లు మాత్రమే అందరికీ తెలుసు కానీ ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ లేదు.. ఐతే ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ త్వరలో రాబోతున్నట్లు సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంబంధించి ఓ చిన్న గ్లింప్స్ రాబోతున్నట్లు సమాచారం.. ఈ గ్లింప్స్ ను ఏప్రిల్ లో రిలీజ్ వస్తుందాని టాక్.. ఆ గ్లింప్స్ తోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలు పెట్టాబోతున్నట్లు సమాచారం..ఈ సినిమాను డైరెక్టర్ అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది…









