Search
Close this search box.

  RAPO 22: రైటర్ గా మారిన రామ్..!

హీరో రామ్ తనదైన స్టైల్ తో సినిమాలు చేస్తున్న యంగ్ హీరోల్లో ఒకరు. కానీ రామ్ చేసిన గత సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద అనుకున్నాంతా స్థాయిలో విజయాలు సాధించలేదు. రామ్ గత రెండు సినిమాలు స్కాంద, ఇస్మార్ట్ శంకర్. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన స్కాంద సినిమా బాక్స్ ఆఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది. తరువాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన డబల్ ఇస్మార్ట్ కూడా బాక్స్ ఆఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది.. అంతేకాదు రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ సినిమాగా డిజాస్టర్ గా డబల్ ఇస్మార్ట్ నిలిచింది.దాంతో రామ్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే అనే కసితో ఉన్నాడు. అందుకే ఈసారి పక్క ప్లానింగ్ తో మంచి స్క్రిప్ట్ సెలక్షన్ చేసుకున్నాడు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో హిట్ కొట్టిన డైరెక్టర్ మహేష్ బాబు డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు.. ఇది రామ్ కెరీర్లో 22వ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో రామ్ సాగర్ అనే పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇది వరకే పోస్టర్ ద్వారా తెలిపింది.. ఐతే ఇప్పుడు ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఐతే ఆ. క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది..ఆ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో రామ్ ఒక పాట రాశాడు అని తెలుస్తుంది.రామ్ ఈ సినిమా కోసం రైటర్ గా మారి ఒక పాటా రాశాడట. ఆ పాట లవ్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటను హీరో రామే పాడబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్.. ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంట్టైనర్ గా రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్య శ్రీ బోర్సే నటిస్తుంది.. ఈ సినిమాకు తమిళ్ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.రామ్ రాసిన సాంగ్ ఎలా ఉండబోతుందని రామ్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు