Search
Close this search box.

  సంక్రాంతికి చిరు సర్‌ప్రైజ్..! ఈసారి మెగా ధమాకా..!

November 25, 2026 11:15 PM | Aditya369 News

సంక్రాంతికి చిరు సర్‌ప్రైజ్..! ఈసారి మెగా ధమాకా..!

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘విశ్వంభర’ గురించి ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు తాజాగా వినిపిస్తున్న సంక్రాంతి వార్త కొత్త ఆశలు కలిగిస్తోంది.

‘బింబిసార’ సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్న మల్లిడి వశిష్ట.. చిరంజీవితో ‘విశ్వంభర’ను ప్రకటించినప్పటి నుంచే ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చాలా కాలం తర్వాత మెగాస్టార్‌ను ఒక కొత్త ఫాంటసీ ప్రపంచంలో చూడబోతున్నామనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.

గతంలో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘అంజి’ వంటి ఫాంటసీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి.. ఇప్పుడు ‘విశ్వంభర’తో మరోసారి అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే సినిమా ప్రారంభమై చాలా కాలం గడుస్తున్నా విడుదల కాకపోవడంతో ఎదురుచూపులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.

ఇక తాజాగా యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా అకౌంట్స్‌లో సినిమాకు సంబంధించిన డబ్బింగ్ ఫొటోలు చక్కర్లు కొడుతుండటంతో సంక్రాంతి రిలీజ్ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. అంతేకాదు, థియేట్రికల్ బిజినెస్ పూర్తయిందని, ఓటీటీ ఒప్పందాల నేపథ్యంలో కూడా సంక్రాంతికి విడుదల చేయాల్సిన పరిస్థితి ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు సంక్రాంతి బరిలోకి వస్తుందని భావించిన చిరంజీవి మరో సినిమా ‘కాకా’ విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శివరాత్రి సమయంలో విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై కూడా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

మొత్తానికి భారీ గ్రాఫిక్స్, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో రూపొందుతున్న ‘విశ్వంభర’ సంక్రాంతి బరిలోకి దిగుతుందనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరి నిజంగానే విశ్వంభరుడు సంక్రాంతికి థియేటర్లలో అడుగుపెడతాడా? లేక మరోసారి విడుదల వాయిదా పడుతుందా? అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు