Search
Close this search box.

  యష్‌ను వెనక్కి నెట్టి నంబర్ 1 స్థానంలో ‘కుంభకర్ణుడు’.. ఫైసల్ మాలిక్‌కు భారీ క్రేజ్!

November 24, 2026 2:45 PM | Aditya369 News

యష్‌ను వెనక్కి నెట్టి నంబర్ 1 స్థానంలో ‘కుంభకర్ణుడు’.. ఫైసల్ మాలిక్‌కు భారీ క్రేజ్!

నితేష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘రామాయణ’ చిత్రం నవంబర్ 5న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి వంటి అగ్రతారలు నటించిన ఈ సినిమాలో రాముడు, రావణుడి పాత్రలపైనే అందరి దృష్టి ఉంటుందని భావించారు. అయితే అనూహ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫైసల్ మాలిక్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ‘పంచాయత్’ వెబ్ సిరీస్‌లో ప్రహ్లాద్ చాచాగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ‘రామాయణ’లో కుంభకర్ణుడిగా నటించి ఆకట్టుకుంటున్నారు. IMDb వారపు ట్రెండింగ్ జాబితాలో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నట్లు సమాచారం.

ఇక రావణుడి పాత్రలో నటించిన యష్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఓటీటీ ప్రేక్షకులను తన సహజమైన నటనతో అలరించిన ఫైసల్ మాలిక్.. ఇప్పుడు వెండితెరపై కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో ఆయన ఎంట్రీ సీన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఫైసల్ మాలిక్ గురించే చర్చ జరుగుతోంది.

గతంలో ‘పంచాయత్’ వెబ్ సిరీస్ సమయంలో ఆయనపై రూపొందించిన మీమ్స్, రీల్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ‘రామాయణ’తో ఆయనకు మరింత క్రేజ్ పెరిగింది. థియేటర్లలో ఆయన ఎంట్రీ సీన్‌ను ప్రేక్షకులు మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలు లక్షలాది వ్యూస్ సాధిస్తుండటంతో పాటు అభిమానులు ఆయనను ట్యాగ్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. స్టార్ హీరోలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ప్రేక్షకుల్లో ఎంతటి ఆదరణ ఉంటుందో ఫైసల్ మాలిక్ మరోసారి నిరూపిస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు