Search
Close this search box.

  ధనుష్ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్..! సమ్మర్‌లో థ్రిల్లర్ ట్రీట్..!

September 25, 2026 9:18 PM | Aditya369 News

ధనుష్ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్..! సమ్మర్‌లో థ్రిల్లర్ ట్రీట్..!

టాలెంటెడ్ హీరో ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక తెలుగులో ధనుష్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమాల్లో ‘సార్’ కూడా ఒకటి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

అయితే ‘సార్’ తర్వాత నిర్మాత నాగవంశీతో ధనుష్ మరో సినిమా చేయబోతున్నట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ సినిమాపై మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చేశారు.

ధనుష్ కెరీర్‌లో 59వ సినిమాగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేశారు. విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే.. సినిమా ఏదో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందనే ఆసక్తి కలుగుతోంది.

ఈ చిత్రాన్ని దర్శకుడు విజయ్ బి. కుమార్ తెరకెక్కించనుండగా.. ‘కన్నప్ప’తో గుర్తింపు తెచ్చుకున్న ప్రీతీ ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

మరోవైపు యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం మరో స్పెషల్ అట్రాక్షన్.

అంతేకాదు.. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మరి ధనుష్ 59వ సినిమా ఎలాంటి థ్రిల్లర్‌ను చూపించబోతుందో చూడాలి!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore