Search
Close this search box.

  ది ప్యారడైజ్‌లో మోహన్ బాబు..! ఇంత భయంకరమైన పాత్రనా..?

September 22, 2026 9:34 PM | Aditya369 News

ది ప్యారడైజ్‌లో మోహన్ బాబు..! ఇంత భయంకరమైన పాత్రనా..?

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రాఘవ్ జుయల్, మోహన్ బాబు వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనుండటంతో ఆ హైప్ మరింత పెరిగింది.

సెప్టెంబర్ 24న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మోహన్ బాబు చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓ కాలేజ్ ఈవెంట్‌లో పాల్గొన్న మోహన్ బాబు.. విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రస్తావన రావడంతో అక్కడున్న స్టూడెంట్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో తన పాత్ర గురించి మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“ది ప్యారడైజ్ సినిమాలో నా పాత్ర చూస్తే.. మీరు నా దగ్గరకు కూడా రారు. అంత భయంకరమైన క్యారెక్టర్ నాది” అంటూ మోహన్ బాబు నవ్వుతూ చెప్పడంతో.. ఇప్పుడు ఆయన పాత్రపై క్యూరియాసిటీ మరింత పెరిగింది.

మోహన్ బాబు ఇంతవరకు చేసిన పాత్రలకు భిన్నంగా.. ఈ సినిమాలో చాలా పవర్‌ఫుల్, ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆయన మాటలను బట్టి చూస్తే.. సినిమాలో ఆయన పాత్ర ఏ స్థాయిలో ప్రభావం చూపించబోతుందోననే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

ఇక ఈ సినిమాలో మోహన్ బాబు షికాంజ మాలిక్ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. నాని, మోహన్ బాబు మధ్య సన్నివేశాలు సినిమాకు కీలకంగా ఉండబోతున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది.

ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

మరి మోహన్ బాబు చెప్పినంత భయంకరంగా ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో తెలియాలంటే.. సెప్టెంబర్ 24న ది ప్యారడైజ్ థియేటర్లలోకి వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు