టాలెంటెడ్ హీరో ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక తెలుగులో ధనుష్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమాల్లో ‘సార్’ కూడా ఒకటి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
అయితే ‘సార్’ తర్వాత నిర్మాత నాగవంశీతో ధనుష్ మరో సినిమా చేయబోతున్నట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ సినిమాపై మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చేశారు.
ధనుష్ కెరీర్లో 59వ సినిమాగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేశారు. విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే.. సినిమా ఏదో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందనే ఆసక్తి కలుగుతోంది.
ఈ చిత్రాన్ని దర్శకుడు విజయ్ బి. కుమార్ తెరకెక్కించనుండగా.. ‘కన్నప్ప’తో గుర్తింపు తెచ్చుకున్న ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటిస్తోంది.
మరోవైపు యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం మరో స్పెషల్ అట్రాక్షన్.
అంతేకాదు.. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మరి ధనుష్ 59వ సినిమా ఎలాంటి థ్రిల్లర్‌ను చూపించబోతుందో చూడాలి!







