మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్‌పై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీని అక్టోబర్ 20న పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి, 2027 చివరి నాటికి షూటింగ్ పూర్తి చేయాలని చిత్రబృందం టార్గెట్‌గా పెట్టుకున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నాడట. పాత్రకు తగ్గట్టుగా ఇప్పటికే బరువు తగ్గే పనిలో చరణ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారనే విషయంపై మాత్రం ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తి నెలకొంది. మరి రంగస్థలం తర్వాత చరణ్–సుకుమార్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి!








